ఒక్కరోజు బడికెళ్లకుండానే పది పరీక్షలకు అర్హత

12 Years Old Bengal Girl Sitting For Board Exams - Sakshi

కోల్‌కతా : ఒక్కరోజు కూడా బడికెళ్లకుండా 12 ఏళ్ల వయసులోని 10 పరీక్షలకు సిద్దమైంది ఓ బెంగాల్‌ అమ్మాయి. నిజానికి పదో క్లాస్ బోర్డ్ పరీక్షలు రాయాలంటే కనీసం 14 ఏళ్ల వయసు ఉండాలి. కానీ ఆ బెంగాల్‌ అమ్మాయి వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లు నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. దీంతో ఆ అమ్మాయికి బోర్డ్‌ పరీక్షలు రాయడానికి అధికారులు అనుమతినిచ్చారు. అంతేకాకుండా ఆ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో 52 శాతం మార్కులు తెచ్చుకోవడం చర్చనీయాంశమైంది.

కనీసం ఒక్క రోజు కూడా స్కూల్‌కెళ్లకుండా ఎలిజిబిలిటీ ఎగ్జామ్‌ అర్హత సాధించడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటారా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాకు చెందిన సైఫా ఖాటున్‌. గతేడాది హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల అగస్త్య జైస్వాల్‌ 12 వ క్లాస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రికార్డుకెక్కాడు. అగస్త్య అక్క నైనా జైస్వాల్‌ 15 ఏళ్లకే పీజీ పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top