ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ @ 112

112 India All-In-One Emergency Helpline Number Launched - Sakshi

న్యూఢిల్లీ: ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌ ‘112’ను మంగళవారం 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘112’ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సేఫ్‌ సిటీ ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయడానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో నిర్భయ ఫండ్‌ కింద రూ.2,919 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టం (ఎఆర్‌ఎస్‌ఎస్‌) కింద ప్రవేశపెట్టిన 112 హెల్ప్‌లైన్‌ కింద ప్రస్తుతం పోలీసు (100), ఫైర్‌ (101), మహిళల హెల్ప్‌లైన్‌ (1090)లను అనుసంధానించగా, త్వరలోనే హెల్త్‌ హెల్ప్‌లైన్‌ (108)ను కూడా చేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కశ్మీర్‌ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top