ప్రగతి భవన్‌ దాటని ముఖ్యమంత్రి | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌ దాటని ముఖ్యమంత్రి

Published Sun, Apr 15 2018 9:20 AM

Komatireddy Venkat Reddy Fires on CM KCR  - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ దాటి బయటికి రావడంలేదని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ పార్కును మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్‌ ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతి రోజు కూడా సీఎం బయటికి వచ్చి నివాళులు అర్పించడానికి తీరికలేదని ఆరోపించారు. అంబేద్కర్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలు నివాళులు అర్పిస్తుంటే కేసీఆర్‌ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్‌లోనే ఉంటున్నాడని విమర్శించారు.

 అంబేద్కర్‌కు నివాళులు అర్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్‌ అందరికీ దార్శనికుడని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, కనగల్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మందడి శ్రీని వాస్‌రెడ్డి, నాయకులు అల్లి సుభాష్‌యాదవ్, సట్టు శంకర్, ఇబ్ర హిం, లతీప్, గుండ్లపల్లి బంగారయ్య, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

దళితుల హక్కులను కాలరాస్తున్నారు  
తిప్పర్తి : దేశంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని, వాటిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో సుప్రీంకోర్టు సవరణలను చేయాలని చూస్తుందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ వేయడంలో విఫలం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సంపత్‌రెడ్డి, కిన్నెర అంజి, లొడంగి వెంకటేశ్వర్లు, భిక్షం, ఆదిమాలం ప్రశాంత్, బద్దం సుధీర్, అబ్దుల్‌ రహీం, శౌరి, గుర్రం శ్రీనివాసరెడ్డి, కిన్నెర రవి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement