'అవును.. అతడిని లవ్ చేస్తున్నా' | Yes I love Siddharth Malhotra, there's no stress: Alia Bhatt | Sakshi
Sakshi News home page

'అవును.. అతడిని లవ్ చేస్తున్నా'

Mar 10 2016 3:56 PM | Updated on Sep 3 2017 7:26 PM

'అవును.. అతడిని లవ్ చేస్తున్నా'

'అవును.. అతడిని లవ్ చేస్తున్నా'

సహనటుడు సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమిస్తున్నట్టు బాలీవుడ్ యువనటి అలియా భట్ వెల్లడించింది.

ముంబై: సహనటుడు సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమిస్తున్నట్టు బాలీవుడ్ యువనటి అలియా భట్ వెల్లడించింది. తామిందరం ప్రేమించుకుంటున్నామని స్పష్టం చేసింది. 'మా గురించి బయట చాలా రకాల కథలు విన్పిస్తున్నాయి. అవును నిజమే. అతడిని ప్రేమిస్తున్నాను. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదు. అతడితో కలిసి షూటింగ్ లో పాల్గొనడం మంచి అనుభూతి' అని అలియా భట్ కుండబద్దలు కొట్టింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు గతంలో పరోక్షంగా వెల్లడించించింది. 'కపూర్ అండ్‌ సన్స్' ప్రచారం భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తన మనసులోని మాటను వెల్లడించింది. తనకు కుడిపైపున వ్యక్తిని ప్రేమిస్తున్నానని తెలిపింది. ఆమెకు కుడివైపున సిద్ధార్థ్ కూర్చుని ఉన్నాడు. ఆమెకు ఎడమ వైపున ఫవద్ ఖాన్ కూర్చొన్నాడు. అలియా భట్ పై ట్విటర్ లో కమల్ ఆర్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సిద్దార్థ్ తీవ్రంగా స్పందించాడు. మహిళలపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించబోనని స్పష్టం చేశాడు. సిద్దార్థ్, అలియా భట్ నటించిన 'కపూర్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement