ఇదే నా చివరి ప్రేమ కథా చిత్రం: విజయ్‌ దేవరకొండ | World Famous Lover Trailer Released | Sakshi
Sakshi News home page

ప్రేమను నింపి సినిమా తీశాను!

Feb 6 2020 4:40 PM | Updated on Feb 12 2020 9:42 AM

World Famous Lover Trailer Released - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయాడు. తరువాత వచ్చిన గీత గోవిందం కూడా విజయాన్ని అందుకోవడంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. తరువాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్‌ అయిన డియర్‌ కామ్రేడ్‌ నిరాశపరచిన హిందీలో సక్సెస్‌ అందుకుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విజయ్‌ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. (ట్రైలర్‌ రెడీ)

ఈ చిత్రంలో రాశీఖన్నా, కేథరిన్‌,ఐశ్వర్య రాజేష్‌, ఈషాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ లాంటి అద్భుతమైన ప్రేమకథ చిత్రాన్ని అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ను తెరకెక్కించారు.  ఇప్పటికే  ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకోగా, చిత్ర యూనిట్‌ గురువారం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

చదవండి : ప్రేమికుడు వచ్చేశాడు

ఈ సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. పూర్తి ప్రేమను నింపి ఈ సినిమాలో పని చేశానని తెలిపాడు. ఇదే తన చివరి లవ్‌ చిత్రం కావొచ్చని, ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.  ఫిబ్రవరి 9న జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ఫిబ్రవరి 14 సినిమా రిలీజ్‌ రోజు మరోసారి తన రౌడీ అభిమానుల్ని కలుస్తానని విజయ్‌ పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement