బుజ్జిగాడికి దిష్టి తగిలింది! | Why Kareena Kapoor Khan was AGAINST hubby Saif Ali Khan sharing baby Taimur's picture! | Sakshi
Sakshi News home page

బుజ్జిగాడికి దిష్టి తగిలింది!

Mar 14 2017 12:31 AM | Updated on Oct 22 2018 6:05 PM

బుజ్జిగాడికి దిష్టి తగిలింది! - Sakshi

బుజ్జిగాడికి దిష్టి తగిలింది!

కరీనా కపూర్‌ కోప్పడ్డారు. భర్త సైఫ్‌ అలీఖాన్‌పై కస్సుబుస్సులాడారు. అసలు మేటర్‌ ఏంటంటే... గతేడాది డిసెంబర్‌లో సైఫీనా దంపతులకు ఓ అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే.

కరీనా కపూర్‌ కోప్పడ్డారు. భర్త సైఫ్‌ అలీఖాన్‌పై కస్సుబుస్సులాడారు. అసలు మేటర్‌ ఏంటంటే... గతేడాది డిసెంబర్‌లో సైఫీనా దంపతులకు ఓ అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. బుడ్డోడి ఫొటోను సైఫ్‌ అలీఖాన్‌ వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవడంతో అతడి ఫ్రెండ్స్‌ అందరూ చూశారు. అంతేనా? ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రేక్షకులూ చూశారు.

బుజ్జిగాడి ఫొటోను చూసినవాళ్లంతా ముద్దు ముద్దుగా ఉన్నాడంటూ మెచ్చుకున్నారు. ప్రశంసలకు తోడు ‘తైమూర్‌’ పేరు తెచ్చిన తంటా ఉండనే ఉంది. దాంతో కరీనా హ్యాపీగా లేరట. ‘‘నా బుడ్డోడికి దిష్టి తగిలింది’’ అని సైఫ్‌పై కోప్పడ్డారట! స్వయంగా సైఫ్‌ అలీఖానే ఈ సంగతిని వెల్లడించారు. ‘నేను అలాంటివి నమ్మను. దిష్టి తగిలుంటే ఈపాటికి కరీనా హాస్పటల్‌లో ఉండేది కదా! మా అబ్బాయి ఫొటోను సీక్రెట్‌గా ఉంచాలనుకో లేదు. అలాగని అందరికీ చూపించా లనుకోలేదు’’ అన్నారు సైఫ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement