‘వాట్‌ ద ఎఫ్‌’ అంటున్న విజయ్‌

What The F Song By Vijay Devarakonda From Geetha Govindam - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాలో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ త్వరలో గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు పరుశురాం దర్శకుడు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రేపు (గురువారం) ఓ పాటను రిలీజ్ చేయనున్నారు.

వాట్‌ ద ఎఫ్‌ అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్‌ దేవరకొండ ఆలపించటం విశేషం. సాంగ్ బై వన్‌ ఫ్రస్ట్రేటెడ్‌ సింగర్‌ అంటూ ప్రమోట్‌ చేస్తున్న ఈ పాటను గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. విజయ్‌ తొలిసారిగా పాడుతున్న ఈ పాటకు గోపి సుందర్‌ సంగీతమందించారు. విజయ్ దేవరకొండ సరసన ఛలో ఫేం రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top