ఆ సినిమా కోసం రూ. 524 కోట్లు తీసుకున్నాడట

Was Robert Downey Jr paid Rs 524 Crore As Salary For Avengers Infinity War - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ ఫీవర్‌ పట్టుకుంది. ఈ సూపర్‌ హీరో సిరీస్‌లో ఇదే లాస్ట్‌ సినిమా కావడంతో వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయ్‌. ఇప్పటికే ఎండ్‌గేమ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ. 8000 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం.  అంతేకాక ఈ సినిమాలో నటించిన వారికి కూడా భారీ పారితోషికాలే అందినట్లు సమాచారం. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’ వసూళ్ల నుంచి వచ్చే మొత్తంలో వాటా కావాలని రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ముందుగానే మార్వెల్‌ సంస్థ అధినేత  కెవిన్‌ ఫీజ్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఇక అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ కోసం డౌనీ ఏకంగా 75 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల(రూ. 524 కోట్లు) భారీ పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. దాంతో హాలీవుడ్‌లో ఇంత భారీ పారితోషికం అందుకున్న అతి కొద్ది మంది నటుల్లో రాబర్ట్‌ డౌనీ ఒకరుగా నిలిచారు. 

అవెంజర్స్‌ సిరీస్‌లో రాబర్డ్‌ డౌనీ ఐరన్‌ మ్యాన్‌ పాత్ర పోషించాడు. ఇక ఎండ్‌గేమ్‌ సినిమాలో కూడా రాబర్డ్‌ డౌనీయే లీడ్‌ రోల్‌ పోషించాడు. అంతేకాక స్పైడర్‌ మ్యాన్‌ హోం కమింగ్‌ సినిమాలో కూడా డౌనీ కూడా కనిపిస్తాడు. అయితే ఈ చిత్రం కోసం కేవలం మూడు రోజులు మాత్రమే పని చేసిన డౌనీ ఒక్క రోజుకు 5 మిలియన్‌ డాలర్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

ఇక ‘అవెంజర్స్‌’లో థార్‌ పాత్రలో నటించిన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ఈ సిరీస్‌ నుంచి ఐదు సినిమాలకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ డీల్‌ నుంచి హెమ్స్‌వర్త్‌కు ముట్టిన మొత్తం 15 మిలియన్‌ డాలర్ల నుంచి 20(రూ. 139 కోట్లు ) మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. కెప్టెన్‌ అమెరికా పాత్రలో నటించిన క్రిస్‌ ఇవాన్స్‌ కూడా దాదాపు 20 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top