వెయిటింగ్ ఫర్ యు పాటలు | Waiting For You Movie Audio Launch | Sakshi
Sakshi News home page

వెయిటింగ్ ఫర్ యు పాటలు

Aug 21 2013 1:20 AM | Updated on Sep 1 2017 9:56 PM

వెయిటింగ్ ఫర్ యు పాటలు

వెయిటింగ్ ఫర్ యు పాటలు

‘‘సునీల్‌కుమార్ రెడ్డి చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనే తపన ఉంది ఆయనకు. రామానాయుడుగారే పిలిచి చిత్రం ఇచ్చారంటేనే ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది’’ అని సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి అన్నారు.

 గాయత్రి, రవి, సాయి అనిల్, సోనిచరిష్టా ముఖ్యతారలుగా సుఖీభవ సమర్పణలో పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్వకత్వంలో ఎక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ‘వెయిటింగ్ ఫర్ యు’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. కోదండరామిరెడ్డి పాటల్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రామిరెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యువతను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’’ అన్నారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. 
 
 గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా విజయం సాధించాలని నీలకంఠ, ‘మధుర’ శ్రీధర్ ఆకాంక్షించారు. సునీల్‌కుమార్ రెడ్డితో తనకిది మూడో సినిమా అని బసిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కె.ఎం.రాధాకృష్ణన్, రవీంద్రబాబు, ప్రవీణ్ ఇమ్మడి, శ్రేష్ట, బాపిరాజు తదితరులు మాట్లాడారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement