మాస్.. మాస్‌గా..! | Sakshi
Sakshi News home page

మాస్.. మాస్‌గా..!

Published Sun, Apr 17 2016 11:35 PM

మాస్.. మాస్‌గా..! - Sakshi

విశాల్, శ్రీదివ్య జంటగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయుడు’. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. విశాల్  కెరీర్‌లో ‘రాయుడు’ క్రేజీ చిత్రమవుతుంది. మేలో పాటలను, అదే నెల 20న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘రఘువరన్ బీటెక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వేల్‌రాజ్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, సమర్పణ: విశాల్.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement