థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు

Vishal speech at Action Pre Release Event - Sakshi

– విశాల్‌

‘‘చాలామంది హీరోలు మూడురాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు. కానీ, అది కొంతమందికే వస్తుంది. అలా ప్రేక్షకుల అభిమానంతో ఇంతదూరం రాగలిగాను. నాకు థియేటరే గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అని హీరో విశాల్‌ అన్నారు. సుందర్‌ సి. దర్శకత్వంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్‌’. తమన్నా కథానాయికగా నటించారు. నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో విశాల్‌ మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో ‘యాక్షన్‌’ 27వ చిత్రం.

నా 26 చిత్రాల్లో నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో ఈ ‘యాక్షన్‌’లో అన్ని తగిలాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 150 కోట్ల బడ్జెట్‌ సినిమాలా అనిపిస్తుంది. కానీ, మా బడ్జెట్‌ 60కోట్లు. నిర్మాతలు బాగుండాలని సినిమాలు తీస్తారు సుందర్‌గారు. నేను నేల టిక్కెట్‌ కొని సినిమాలు చూస్తాను. అప్పుడే ప్రేక్షకులు ఏ సీన్స్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారో గమనిస్తాను. ఈ సినిమాలో నా మిత్రుడు హీరో రానా ఒక ర్యాప్‌ పాడారు. త్వరలోనే మీరు వింటారు. శ్రీను మంచి విజన్, ప్యాషన్‌ ఉన్న ప్రొడ్యూసర్‌’’ అన్నారు.

‘‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంతృప్తికరంగా అనిపించలేదు.  డైరెక్టర్‌ అవుదామని 6–7 సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్‌ ఫీల్డ్‌లోకి వచ్చి ‘ఇస్మార్ట్‌శంకర్, గద్దలకొండ గణేశ్, రాజుగారి గది 3’ చిత్రాలను పంపిణీ చేశా. ఇప్పుడు ‘యాక్షన్‌’ సినిమాతో నిర్మాతగా మారినందుకు సంతోషంగా ఉం ది. ప్రిన్స్‌ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు శ్రీనివాస్‌ ఆడెపు. ‘‘యాక్షన్‌’ చిత్రం నాకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’’ అన్నారు తమన్నా. నటులు ఆదిత్, ప్రిన్స్, నటీమణులు ఐశ్వర్యా లేక్ష్మి, ఆకాంక్ష, సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ మాట్లాడారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top