గుప్పెడంత ప్రేమ కోసం.. | Vinod Lingala's directorial debut Guppedantha Prema | Sakshi
Sakshi News home page

గుప్పెడంత ప్రేమ కోసం..

Jun 8 2016 11:50 PM | Updated on Sep 4 2017 2:00 AM

గుప్పెడంత ప్రేమ కోసం..

గుప్పెడంత ప్రేమ కోసం..

ఇంజనీరింగ్ పూర్తి చేసిన నేను యూరోపియన్ యూనియన్ ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో లండన్‌లో ఎంఎస్ పూర్తి చేశా.

‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసిన నేను యూరోపియన్ యూనియన్ ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో లండన్‌లో ఎంఎస్ పూర్తి చేశా. సినిమాలపై ఇష్టంతో అక్కడే కొన్ని కోర్సులు నేర్చుకున్నా. ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశా. దర్శకుడిగా మారి ‘గుప్పెడంత ప్రేమ’ చిత్రం తెరకెక్కించా’’ అని దర్శకుడు వినోద్ లింగాల అన్నారు.

 సాయి రోనక్, అదితీ సింగ్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఓ జంట మధ్య కలిగే ఫస్ట్ లవ్ ఫీలింగ్స్‌ను ఇందులో చూపించాం. గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడనేది కథాంశం. నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పావని లింగాల.
 

Advertisement
 
Advertisement
Advertisement