ఇదో మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌

Vinaya Vidheya Rama Rama Loves Seetha song first look teaser release - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం 2గంటల 26 నిమిషాల నిడివి ఉందని సమాచారం. అలాగే  ఈ సినిమాలోని ‘రామా లవ్స్‌ సీత..’ పాటను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఈ సినిమా గురించి రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఇందులో బ్యూటిఫుల్‌ అండ్‌ బ్యాలెన్డ్స్‌ క్యారెక్టర్‌ చేశాను. పూర్తి స్థాయి మాస్‌ ఫిల్మ్‌లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. సినిమాలో అజర్‌ బైజాన్‌ లొకేషన్స్‌ను నేపాల్‌–బీహార్‌ సరిహద్దు ప్రాంతంలా చూపించాం. కియారా ఫైన్‌ ఆర్టిస్టు. ఆ అమ్మాయి కళ్లతో మంచి హావభావాలు పలికించగలదు. మంచి డ్యాన్స్‌ పార్టనర్‌. ‘రామా లవ్స్‌ సీత’ సాంగ్‌ విజువల్‌గా హైలైట్‌గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్‌ ఒబెరాయ్‌గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది.

లొకేషన్‌లో బాగా ఎంజాయ్‌ చేశాం కూడా. పెద్ద సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు దానయ్యగారు. ఆయనతో చేస్తే మా హోమ్‌ బ్యానర్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేసినట్లే ఉంటుంది. బోయపాటిగారు మంచి కన్విక్షన్‌తో సినిమా చేస్తారు’’ అన్నారు. ఇంకా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి చెబుతూ– ‘‘ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే సర్‌ప్రైజ్‌ కాలేదు. సెట్‌లో ఎలా ఉంటామని కూడా ఆలోచించలేదు. బయట మేం మంచి స్నేహితులం. అదే షూటింగ్‌లో కూడా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఎక్కువ రివీల్‌ చేయకూడదు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది’’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top