
తమిళసినిమా: సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో సిమాన్ విక్రమ్ వారసుడు హీరోగా ఎంట్రీ అవుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసిన తన కొడుకు ధృవ్‌ను విక్రమ్ హీరోగా పరిచయం చేయాలని గత ఏడాదే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి మంచి కథ కోసం అన్వేషణ సాగిస్తున్న ఆయకు తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి దృష్టిలో పడింది. ఇదే తన వారసుడికి సరైన ఎంట్రీ అవుతుందని భావించారు. అంతే అర్జున్‌రెడ్డి ధృవ్ హీరోగా తమిళంలో రీమేక్‌కు రెడీ అయిపోయింది. అయితే దర్శకుడెవరన్న ప్రశ్నకు తాజాగా క్లారిటీ వచ్చింది. విక్రమ్‌కు సేతు చిత్రంలో నటుడిగా బ్రేక్ ఇచ్చిన సంచలన దర్శకుడు బాలా అర్జున్‌రెడ్డిని తమిళ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోమవారం అధికారకపూర్వకంగా వెల్లడించారు. దీన్ని ఈ4 ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది.
ఇందులో ధృవ్‌తో జత కట్టే నాయకి ఎవరన్నది ఆసక్తిగా మారింది. షమితాబ్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ, వివేగం చిత్రంతో కోలీవుడ్‌లోనూ మెరిసిన విశ్వనటుడి వారసురాలు అక్షరహాసన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే సమయంలో బాల నటిగా పరిచయమై గుర్తింపు పొందిన శ్రియశర్మకు కూడా ఇందులో హీరో యిన్ అయ్యే అవకాశం ఉం దనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ఇద్దరు బ్యూటీస్‌లో ఎవరికి ధృవ్‌తో జోడీ కట్టే అవకాశం వస్తుందో తెలిసి పోతుంది. సేతు, నందా, పితామగన్, పరదేశి, తారైతప్పట్టై ఇలా వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించి తనకుంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు బాలా 18 ఏళ్ల సినీచరిత్రలో తొలిసారిగా రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం.