‘సర్కార్‌’పై వివాదం.. సన్నివేశాలు తొలగించాలని డిమాండ్‌!

Vijay Sarkar In Disputes And Demonding Scenes Should Remove - Sakshi

తమిళనాట విజయ్‌ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతలా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. అయితే ఆయన సినిమాలను వివాదాల్లోకి లాగడానికి కూడా ఎదురుచూసేవాళ్లు ఉంటారు. ఈయన చిత్రాలు వివాదాలు సృష్టించడం కొత్తేంకాదు. ఈయన గత చిత్రం మెర్సెల్‌లో జీఎస్టీ, భారత ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాల్సిందిగా కొంతమంది నానారచ్చ చేశారు. చివరగా వాటికి సంబంధించిన సన్నివేశాల్లో మాటలను కట్‌ చేశారు. 

వివాదాలతోనే ఈయన సినిమాలు మరింత దూసుకెళ్తున్నాయి. మెర్సెల్‌ అంతగా విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమే. అయితే రీసెంట్‌గా విడుదలైన సర్కార్‌... కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా కూడా రాజకీయ వ్యవస్థపైనే చిత్రీకరించారు. ఇందులో జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఇంతకి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top