కామ్రేడ్ వెనక్కి తగ్గుతాడా..? | Vijay Deverakonda Plans to Avoid Clash with Suriya NGK | Sakshi
Sakshi News home page

కామ్రేడ్ వెనక్కి తగ్గుతాడా..?

Mar 28 2019 11:03 AM | Updated on Mar 28 2019 11:03 AM

Vijay Deverakonda Plans to Avoid Clash with Suriya NGK - Sakshi

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈసినిమా మే 31న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

అయితే తమిళ్‌లో సూర్య, సెల్వరాఘవన్‌ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్‌జీకే సినిమాను మే 31న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్‌. దీంతో డియర్‌ కామ్రేడ్ టీం ఆలోచనలో పడింది. సూర్య సినిమా అంటే తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తారు. అదే రోజు తమ సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట అందుకే వారం ఆలస్యంగా జూన్‌ 6న సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement