లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

 Vijay Devarakonda Sensational Comments on Lip Lock Scenes  - Sakshi

సాక్షి, చెన్నై: లిప్‌ లాక్‌లపై టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ తమిళ ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మీడియాతో మాట్లాడారు. లిప్ లాక్‌లపై మీడియా అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ కొంత ఉద్వేగంగా మాట్లాడాడు. ‘సినిమాలో వచ్చే లిప్‌ లాక్‌ దృశ్యాలు చూసేవాళ్లకు వినోదంగా, సరదాగా ఉంటుంది. ఈ సన్నివేశాల్లో పాల్గొన్న నటీనటుల గురించి హేళనగా మాట్లాడతారు. కానీ.. సినిమా అనేది చాలా సీరియస్ విషయం, సినిమా అంటే మంచి కథ, అందులోనే భవిష్యత్తు, నిర్మాత డబ్బులు, దర్శకుడి జీవితం, కొత్త ఆర్టిస్టులకు వాళ్లని వాళ్లు నిరూపించుకునే వేదిక. ఇక హీరోయిన్లు వాళ్ల కెరీయర్, తాము ఎన్నుకున్న రంగంలో ఏదైనా సాధించాలనే తపనతో వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం. ఇవన్నీ సినిమాతో ముడిపడి ఉంటాయి. 

సినిమాల్లో లిప్ లాక్ సీన్లు రొమాంటిక్‌గా చూడటాపిరి వినోదంగా ఉంటాయి. కానీ.. ఆయా సన్నివేశాలు మా జీవితాలపై సీరియస్‌గా ఉంటుంది. ఆ సీన్లు చూసి నటీనటుల గురించి  చాలా ఈజీగా కామెంట్ చేస్తారు. అంతేకాదు సినిమా చూసి ....ఆయా క్యారెక్టర్లను వీళ్లు ఇంతే అనటం ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు. సినిమా విడుదల తర్వాత లభించే హిట్‌తో మాకు రిలాక్స్ దొరుకుతుంది. ఇది ఆటలాడుకునే విషయం కాదు. సినిమా అంటేనే సీరియస్. డియర్ కామ్రేడ్ అలాంటి సినిమానే కానీ లిప్ లాక్  సినిమా కాదు. ఇక నేను హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు తెలంగాణా, అదీ పక్కా హైదరాబాదీ యాస అలవాటైంది. సినిమాల్లో సాధారణంగా యాస లేకుండా తెలుగు మాట్లాడాలని చెప్పేవారు.  కానీ నా యాసలోనే మాట్లాడటం, అది సక్సెస్ కావటంతో మిగిలిన చిత్రాల్లో కూడా ఇలాగే కొనసాగిస్తున్నా.’  అని తెలిపాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న కన్నా ముందు హీరోయిన్‌ సాయి పల్లవి సంప్రదించారని అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను ఆమె తిరస్కరించినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top