బిచ్చగాడిగా అర్జున్ రెడ్డి..? | Vijay Devarakonda In Bichhagadu Kannada remake | Sakshi
Sakshi News home page

బిచ్చగాడిగా అర్జున్ రెడ్డి..?

Sep 15 2017 1:18 PM | Updated on Sep 19 2017 4:36 PM

బిచ్చగాడిగా అర్జున్ రెడ్డి..?

బిచ్చగాడిగా అర్జున్ రెడ్డి..?

అర్జున్ రెడ్డి సినిమాతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ రేంజే మారిపోయింది.

అర్జున్ రెడ్డి సినిమాతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ రేంజే మారిపోయింది. యూత్ లో భారీ ఫాలోయింగ్ తో పాటు బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా తన ఖాతాలో పడింది. ప్రస్తుతం విజయ్ ఈ సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ లో ఇతర ఇండస్ట్రీల దృష్టిలో పడ్డ ఈ యంగ్ హీరో త్వరలో కన్నడలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

పుట్టపర్తిలో చదువుకున్న విజయ్ కి కన్నడ భాష మీద పట్టు ఉండటంతో త్వరలో అక్కడ హీరోగా పరిచయమయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తన సినిమాలతో కాకుండా దక్షిణాదిలో సంచలనం సృష్టించిన ఓ తమిళ సినిమాను కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అర్జున్ రెడ్డి. చిన్న సినిమాగా విడుదలై తెలుగు, తమిళ సంచలన విజయం సాధించిన బిచ్చగాడు సినిమాను కన్నడలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement