అర్జున్‌ రెడ్డి తమ్ముడ్ని చూశారా? | Vijay Devarakonda Brother Anand Ready to Launch | Sakshi
Sakshi News home page

May 28 2018 2:03 PM | Updated on May 28 2018 4:11 PM

Vijay Devarakonda Brother Anand Ready to Launch - Sakshi

విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ పాత చిత్రం

టాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డిగా విజయ్‌ దేవరకొండ సెట్‌ చేసిన మార్క్‌ అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించేసుకున్నాడు. ప్రస్తుతం సౌత్‌లో విజయ్‌ వన్‌ ఆఫ్‌ ది క్రేజీ స్టార్‌. అలాంటి విజయ్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడన్న వార్త ఒకటి వైరల్‌ అవుతోంది. అదెవరో కాదు విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. 

ప్రస్తుతం ఫిలిం క్రాఫ్ట్స్‌లో అతను ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడన్నది ఆ కథనం సారాంశం. విజయ్‌కు బాగా క్లోజ్‌ అయిన ఓ బడా నిర్మాణ సంస్థ.. ఆనంద్ అరంగేట్రానికి సంబంధించిన బాధ్యతలను తీసుకుందంట. ప్రస్తుతం ఆనంద్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్ పనిలో పడ్డాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయ్‌ ఫ్యాన్స్‌లో కొన్ని సందేహాలు కలుగుతున్నాయి‌. ‘ఆనంద్‌ కూడా విజయ్‌లా రెబల్‌గా ఉంటాడా? లేదా అంతకన్నా వైల్డ్‌ గా ఉంటాడా? అతను సినిమాల్లోకి వచ్చే వార్త నిజమేనా?.. వస్తే అర్జున్‌ రెడ్డి తమ్ముడిగా ఆ అంచనాలను ఏ మేర అందుకుంటాడు?... ప్రస్తుతం ఆనంద్‌ను చూపిస్తూ విజయ్‌ ఫ్యామిలీ ఫోటో పాతది ఒకటి చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement