‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్‌ | Vidya Balan on Indira Gandhi Web Series | Sakshi
Sakshi News home page

ఇందిరా గాంధీ వెబ్‌ సిరీస్‌లో విద్యాబాలన్‌

Aug 23 2019 4:52 PM | Updated on Aug 23 2019 5:46 PM

Vidya Balan on Indira Gandhi Web Series - Sakshi

చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు వెబ్‌ సిరీస్‌ల మీద పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌, నవాజుద్దిన్‌ సిద్ధిఖి వంటి ప్రముఖులు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ డిజిటల్‌ మీడియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి తాజాగా విద్యాబాలన్‌ కూడా చేరారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌లో విద్యాబాలన్‌ నటించనున్నారని సమాచారం. ఈ సిరీస్‌కి విద్యాబాలనే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

దీని గురించి విద్యాబాలన్‌ మాట్లాడుతూ.. ‘ఇందిరా గాంధీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం హక్కులను రెండేళ్ల క్రితమే నేను తీసుకున్నాను. అయితే ఆ సమయంలో నాకు వెబ్‌ సిరీస్‌ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. సినిమాకు, వెబ్‌ సిరీస్‌కు చాలా తేడా ఉంది. సినిమాతో పోలీస్తే వెబ్‌ సిరీస్‌ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందిరా జీ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు కాస్త ఎక్కువ సమయమే కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పలేను కానీ ఏడాది, రెండేళ్లలో ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాను’ అన్నారు విద్యాబాలన్‌.

Advertisement
 
Advertisement
Advertisement