
వెంకటేశ్
తెలుగు మాస్టర్‌గా పద్యాలు చెప్పిన వెంకటేశ్ ఇప్పుడు ఫిజిక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఆల్మోస్ట్ పాతికేళ్ల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుందరకాండ’ చిత్రంలో వెంకటేశ్ తెలుగు మాస్టర్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తేజ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలోనే వెంకీ ఫిజిక్స్ లెక్చరర్‌గా నటించనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.
ఈ సినిమాలో వెంకటేశ్ లుక్ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇంతకీ ఫొటోను బాగా గమనించారు కదా! వెంకీ చేతిలో ఉంది ఫిజిక్స్ సబ్జెక్ట్‌కి చెందిన బుక్. సో.. ఈ సినిమాలో ఆయన ఫిజిక్స్ లెక్చరర్‌గా కనిపించనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. నారా రోహిత్ ఓ కీలక పాత్రను చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ, అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో వెంకటేశ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.