ఆటోడ్రైవర్ కోసం... | Vathikuchi has been dubbed in telugu and is titled pranam kosam | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్ కోసం...

Dec 19 2013 12:46 AM | Updated on Sep 2 2017 1:45 AM

అంజలి

అంజలి

‘‘ఓ షేర్ ఆటోడ్రైవర్ ప్రేమకథ ఇది. ఆటోడ్రైవర్‌గా దర్శకుడు మురుగుదాస్ తమ్ముడు దిలీపన్ నటించారు. అతనికి జోడీగా అంజలి కనిపిస్తారు.

‘‘ఓ షేర్ ఆటోడ్రైవర్ ప్రేమకథ ఇది. ఆటోడ్రైవర్‌గా దర్శకుడు మురుగుదాస్ తమ్ముడు దిలీపన్ నటించారు. అతనికి జోడీగా అంజలి కనిపిస్తారు. అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది’’ అని నిర్మాతలు సంరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎం.వెంకట్రావు చెప్పారు. తమిళంలో మురుగదాస్ నిర్మాణంలో రూపొందిన ‘వట్టికుచ్చి’
 తెలుగులో ‘ప్రాణం కోసం’గా అనువాదమవుతోంది. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. మురుగదాస్ చెబుతూ -‘‘నేను తొలిసారిగా నిర్మించిన ‘జర్నీ’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా అదే తర హాలో ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: పి.కిన్‌స్లిన్.

Advertisement

పోల్

Advertisement