తప్పదు... గట్టిగా తిట్టాలి! | Varun tej should work well with Jim Trainer | Sakshi
Sakshi News home page

తప్పదు... గట్టిగా తిట్టాలి!

Jun 4 2017 12:03 AM | Updated on Sep 5 2017 12:44 PM

తప్పదు... గట్టిగా తిట్టాలి!

తప్పదు... గట్టిగా తిట్టాలి!

స్టోరీ డిమాండ్‌ చేస్తే హీరోలు ఫైట్‌ చేయాలి. ఫైట్‌ చేయాలంటే బాడీ ఫిట్‌గా ఉండాలి

స్టోరీ డిమాండ్‌ చేస్తే హీరోలు ఫైట్‌ చేయాలి. ఫైట్‌ చేయాలంటే బాడీ ఫిట్‌గా ఉండాలి. బాడీ ఫిట్‌గా ఉండాలంటే డైలీ జిమ్‌లో వర్కౌట్స్‌ చేయాలి. డైలీ వర్కౌట్స్‌ చేయాలంటే... జిమ్‌ ట్రైనర్‌ హీరో చేత బాగా వర్కౌట్స్‌ చేయించాలి. అలా చేయించాలంటే... ట్రైనర్‌ను గట్టిగా తిట్టాలంటున్నారు వరుణ్‌తేజ్‌!

ఎవరైనా తిడితే ట్రైనింగ్‌ బాగా ఇస్తారా? ఏదో బతిమాలో... బుజ్జగించో... ట్రైనింగ్‌ తీసుకోవాలి గానీ అంటారా! వరుణ్‌తేజ్‌ మాత్రం గట్టిగా తిట్టాలని ట్వీట్‌ చేశారు. వరుణ్‌ వర్కౌట్స్‌ చేస్తానంటుంటే అతని ట్రైనర్‌ కులదీప్‌ సేథి ‘ఇక చాల్లే’ అని వెళ్లిపోతున్నట్టున్నారు! వెంటనే ఫొటో తీసి ‘‘వర్కౌట్స్‌ టైమ్‌లో ట్రైనర్‌ను గట్టిగా తిట్టకపోతే... నీకు సరిపడా ట్రైనింగ్‌ ఇవ్వడు. లివ్‌ ఫిట్‌... బి స్ట్రాంగ్‌’’ అని వరుణ్‌తేజ్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement