బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

Varun Sandesh And Vithika Sheru Fighting In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రెండో వారంలో హౌస్‌మేట్స్‌కు ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడ్డట్టున్నాయి. బాత్రూమ్‌లో నీళ్లు కరువయ్యాయి, వంట గదిలో గ్యాస్‌ అయిపోతోంది.. వీటన్నంటిని మళ్లీ పంపించాలంటే సైక్లింగ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. నిరంతరం సైకిల్‌ తొక్కుతూనే ఉండాలనే షరతు కూడా పెట్టాడు. ఇక హౌస్‌లో రగడ మొదలు కాకుండా ఉంటుందా? ఇంతవరకు ప్రేమగా ఉన్న జంటపక్షుల మధ్య గొడవ మొదలైనట్టు తాజాగా విడుదల చేసిన ప్రోమోతో అర్థమవుతోంది.

ఓ జంటను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదేనని సోషల్‌ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతుండగా.. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో కూడా దీనికి ఊతమిస్తోంది. తాను 35, 40 దోశలు వేశానని వితిక చెబుతుండగా.. ‘గ్యాస్‌ తొక్కకపోతే నువ్వు వేసేదానివి కాద’ని పునర్నవి పేర్కొంది. ‘నువ్వు కాకపోతే వేరే ఎవరైనా గ్యాస్‌ తొక్కేవారు’ అని వితికా అనగానే.. ‘నువ్వు కాకపోతే దోశలు వేరేవాళ్లు వేసేవార’ని వరుణ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. తనకు ఏది నిజమనిస్తే అటు వైపే ఉంటానని వరుణ్‌ తేల్చి చెప్పాడు. దీంతో వితిక కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తడం ప్రోమోలో కనిపిస్తోంది. మరి ఇంతకీ నిజంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే నేడు ప్రసారమయ్యే షో చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top