సాహోరే.. హైబ్రిడ్‌ పిల్లా | Vachinde Song Surpass Saahore Baahubali | Sakshi
Sakshi News home page

May 17 2018 8:19 PM | Updated on May 17 2018 8:27 PM

Vachinde Song Surpass Saahore Baahubali - Sakshi

బాహుబలిలో ప్రభాస్‌.. ఫిదాలో సాయి పల్లవి

సాక్షి, హైదరాబాద్‌: బాహుబలి సిరీస్‌ సృష్టించిన ప్రభంజనం తెలియంది కాదు. మరోవైపు ఫిదా చిత్రం టాలీవుడ్‌లో క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. రెండూ కూడా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించినవే. కలెక్షన్లపరంగా సంగతి పక్కనపెడితే మ్యూజిక్‌ పరంగా మాత్రం ఫిదానే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇందుకు నిదర్శనంగా యూట్యూబ్‌లో ఓ రికార్డును ప్రస్తావిస్తున్నారు. బాహుబలి-2లోని టైటిల్‌ సాంగ్‌ సాహోరో బాహుబలి పాట కన్నా ఫిదాలోని వచ్చించే సాంగ్‌ ఎక్కువగా వ్యూవ్స్‌ రావటం విశేషం. సాహోరే సాంగ్‌ 11 నెలల్లో సాధించిన వ్యూవ్స్‌ను వచ్చిండే సాంగ్‌ 7 నెలల్లోనే దాటేసింది. బాహుబలి ది కంక్లూజన్‌కి ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ అందించగా.. ఫిదాకు శక్తికాంత్‌ సంగీతం అందించారు. హైబ్రిడ్‌ పిల్ల సాయి పల్లవి చేసిన మ్యాజిక్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ స్క్రీన్‌ షాట్లతో హల్‌ చల్‌ చేస్తున్నారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement