9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘ధురంధర్‌’.. నిర్మాత ట్వీట్‌ వైరల్‌ | Dhurandhar 2 Breaks Baahubali 2 Record, Shobu Yarlagadda Tweet Viral | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’ రికార్డుకి ‘ధురంధర్‌’ బ్రేక్‌.. శోభు యార్లగడ్డ ఏమన్నారంటే..

Mar 29 2026 1:43 PM | Updated on Mar 29 2026 1:46 PM

Dhurandhar 2 Breaks Baahubali 2 Record, Shobu Yarlagadda Tweet Viral

ధురంధర్‌ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌,టాలీవుడ్‌ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్‌కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది. 

ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్‌ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్‌ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్‌ చేసింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్‌ 2 అధిగమించింది’ అని ఓ  నెటిజన్‌ పోస్ట్‌ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్‌ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement