Shobu Yaralagadda
-
9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నిర్మాత ట్వీట్ వైరల్
ధురంధర్ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్‌కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది. ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్ 2 అధిగమించింది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026 -
రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. వామ్మో అంత రన్ టైమ్?
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా రన్ టైమ్ గురించి తెగ చర్చ నడుస్తోంది. రెండు పార్ట్స్ ఓకేసారి కావడంతో నిడివిపై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత శోభు యార్లగడ్డ రన్ టైమ్ గురించి మాట్లాడారు.బాహుబలి: ది ఎపిక్ మూవీ రన్‌టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్..ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిరపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు. -
‘అతడి కోసమే బాహుబలి కథ రాశారు’
బెంగళూరు: బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. యంగ్ రెబల్ స్టార్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ రాశారని వెల్లడించారు. ‘బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. ఎందుకంటే ఈ కథను అతడిని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. అందుకే మేము వేరెవరినీ సంప్రదించలేదు. మరొకరిని సంప్రదించినట్టు వార్తల్లో నిజం లేద’ని ఆయన పీటీఐతో చెప్పారు. బాహుబలి సినిమాను 1975 నాటి బాలీవుడ్ సూపర్‌హిట్ ‘షోలో’తో పోల్చడంపై స్పందిస్తూ... దర్శకుల దార్శనికత, సాహసం కారణంగానే ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయని చెప్పారు. బాహుబలి 3 గురించి ఆలోచించడం లేదన్నారు. యానిమేషన్, టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బాహుబలి సిరీస్ కొనసాగుతుందని పేర్కొన్నారు. బాహుబలి మొదటిభాగం కంటే రెండో భాగం బాగుందని తమ యూనిట్ అభిప్రాయపడిందని వెల్లడించారు. బాహుబలి 2లో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఏ పాత్ర బాగా నచ్చిందని అడగ్గా... అమరేంద్ర బాహుబలి కేరెక్టర్ తనను అమితంగా ఆకట్టుకుందని సమాధానమిచ్చారు. రియల్ లైఫ్ స్టోరీలతో సినిమాలు నిర్మిస్తారా అని ప్రశ్నించగా మంచి కథ, తమ బృందాన్ని ఎగ్జైట్ చేసే అంశాలుంటే ముందుకెళతామని చెప్పారు.


