బాలకృష్ణతో డింపుల్‌.. మీకెవరు చెప్పారంటూ గోపీచంద్‌ కౌంటర్‌ | Gopi Chand Malineni Uses Mahesh Babu Meme For Dimple Hayathi In NBK111 Rumours, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బాలకృష్ణతో డింపుల్‌.. మీకెవరు చెప్పారంటూ గోపీచంద్‌ కౌంటర్‌

Mar 29 2026 11:21 AM | Updated on Mar 29 2026 12:36 PM

Gopi Chand Malineni Uses Mahesh Babu Meme for Dimple Hayathi in NBK111 Rumours

బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. గతంలో ‘వీర సింహారెడ్డి’తో  విజయం అందుకున్న తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. అయితే, ఇందులో హీరోయిన్‌గా డింపుల్ హయాతిని తీసుకున్నారని సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఎంపిక అనేది దర్శకుడి  బ్లండర్ మిస్టేక్ అని.. ఆమెకు బదులుగా రవీనా టండన్‌ని తీసుకుంటే బాగుండేదని  నెటిజన​్‌ పోస్ట్‌ చేశారు. అయితే, దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఫన్నీగా మహేష్‌బాబు వీడియోతో సమాధానం ఇచ్చారు.

హీరోయిన్‌ ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. మంచి హైప్ ఉన్న సినిమాను(NBK111) ఎలా చెడగొట్టాలో  మేకర్స్ ని చూసి బాగా నేర్చుకోవచ్చని నెటిజన్‌ పోస్ట్‌ చేయడంతో దర్శకుడు గోపీచంద్‌ మలినేని కౌంటర్‌ ఇచ్చారు.  సింపుల్‌గా మహేష్ బాబు మాట్లాడుతున్న ఒక మీమ్ వీడియోను పంచుకుంటూ, ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. 'మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేను అయితే ఎవరికీ చెప్పలేదండి' అనే మహేష్‌ డైలాగ్‌ను షేర్‌ చేశారు.

ఇప్పటికే షూటింగ్‌ మొదలైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో  ప్రత్యేక సెట్‌లో జరుగుతున్న షూటింగ్‌లో బాలయ్య పాల్గొంటున్నట్లు టాక్‌. ఇది ముంబయి నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement