న్యూ బిగినింగ్‌

Vaani Kapoor to romance Ranbir Kapoor  - Sakshi

కొత్త ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు నటి వాణీ కపూర్‌. ఇంతకీ ఈ బ్యూటీ తెలుసు కదా. నాలుగేళ్ల క్రితం నాని హీరోగా వచ్చిన ‘ఆహా కల్యాణం’ చిత్రం తో సౌత్‌కు ఎంట్రీ ఇచ్చారామె. ఫస్ట్‌ ‘శుద్ద్‌ దేశీ రొమాన్స్‌’ హిందీ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిశారామె. అయితే చాన్స్‌లు మాత్రం ఆశించినంతగా రాలేదు. రెండేళ్ల క్రితం రణ్‌వీర్‌ సింగ్‌ సరసన చేసిన ‘బేఫికర్‌’ వాణీ కపూర్‌ చివరి చిత్రం. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో రూపొందనున్న ‘షంషేరా’ చిత్రంలో కథనాయికగా ఎంపికయ్యారు.

‘‘న్యూ బిగినింగ్స్‌.. ‘షంషేరా’ చిత్రం లో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు వాణీ కపూర్‌.  రెండేళ్ల బ్రేక్‌ తర్వాత నూతనోత్సాహంతో న్యూ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసిన వాణీ కపూర్‌ కెరీర్‌ ఇకనైనా గుడ్‌ ట్రాక్‌పై నడవాలని ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు. ‘‘వాణీ ఫైనెస్ట్‌ యాక్టర్‌. సూపర్‌ డ్యాన్సర్‌. ఈ సినిమాలోని పాత్రకు కరెక్ట్‌గా సూట్‌ అవుతుందని ఎంపిక చేశాం’’ అన్నారు దర్శకుడు కరణ్‌. ఈ సినిమాలో సంజయ్‌దత్‌ కీలక పాత్ర చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top