 
															ఆ వీక్‌నెస్‌ను వదులు కోలేకపోతున్నా!
ఇప్పుడంతా జీరోసైజ్ ట్రెండ్. స్లిమ్‌గా ఉండే కథానాయికలకే సూపర్‌క్రేజ్. అందుకే బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు సన్నబడటానికి
	ఇప్పుడంతా జీరోసైజ్ ట్రెండ్. స్లిమ్‌గా ఉండే కథానాయికలకే సూపర్‌క్రేజ్. అందుకే బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు సన్నబడటానికి ఎక్కువ  ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడా లిస్ట్‌లో పరిణీతి చోప్రా కూడా చేరారు. ఇటీవలే తన లేటెస్ట్ ఫొటోలతో చక్కనమ్మ చిక్కినా అందమే అనేలా మునపటి కన్నా అందంగా తయారయ్యారు. ఇక బొద్దుగా కాకూడదని ఫిక్స్ అయి డైటింగ్ చేస్తున్నారట.  డైలీ రొటీన్ నుంచి  తనకెంతో ఇష్టమైన  చాక్లెట్స్, కేక్స్‌ను తీసేశారట.
	
	కానీ ఎప్పటి నుంచో తనకున్న పిజ్జా వీక్‌నెస్‌ను మాత్రం వదులుకోలే కపోతున్నారు. ఎక్కడైనా పిజ్జా కనిపిస్తే చాలు, ఆమె తన జిహ్వ చాపల్యాన్ని అదుపుచేసుకోలేకపోతున్నారట.  అందుకే ఇంత స్ట్రిక్ట్‌గా డైటింగ్‌ను ఫాలో అవుతున్నా సరే, పిజ్జా తినాలనిపించి నప్పుడు మెల్లగా లాగించేస్తున్నారు.  తీరా తిన్నాక మాత్రం ‘అయ్యో’ అంటూ బాధపడుతున్నారట.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
