
జేడీ చక్రవర్తి, ‘అమ్మ’ రాజశేఖర్
నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జేడీ చక్రవర్తి హీరోగా ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో ‘నక్షత్ర’ రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘ఉగ్రం’. అక్షత కథానాయిక. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘గులాబీ, సత్య వంటి హిట్ చిత్రాల తర్వాత ‘అమ్మ’ రాజశేఖర్ చెప్పిన కథకు జేడీ చక్రవర్తి ఎగై్జట్ అయ్యి నటించారు. యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రం ఇది. ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: అంజి, సంగీతం: జాన్ పోట్ల, సహనిర్మాత: బండి శివ.