అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌ | Twinkle Khanna Comments Over Akshay Kumar Donation | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ విరాళం : గర్వపడేలా చేశాడు

Mar 29 2020 4:51 PM | Updated on Mar 29 2020 4:59 PM

Twinkle Khanna Comments Over Akshay Kumar Donation - Sakshi

కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు రూ. 25 కోట్లు భారీ విరాళం ప్రకటించి అక్షయ్‌ కుమార్‌ అందరి మనసులు గెలుచుకున్నారు. భర్త అంత పెద్ద మొత్తం విరాళం ఇవ్వటంపై ట్వింకిల్‌ ఖన్నా స్పందించారు. శనివారం ట్విటర్‌ వేదికగా.. ‘‘అతడు అంతపెద్ద మొత్తం విరాళం ఇస్తానన్నపుడు ‘ ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే మనం ఏదైనా అమ్మాల్సి వస్తుంద’ని అన్నా. అప్పుడు తను ‘ నా సినీ జీవితాన్ని ప్రారంభించే సమయానికి నావద్ద ఏమీ లేదు. ఇప్పుడు నేనీ పొజిషన్‌లో ఉన్నాను, లేని వాళ్లకోసం నేను అనుకున్నది చేసినపుడే కొంతైనా తిరిగివ్వగలన’ని అన్నాడు. నా భర్త నేను గర్వపడేలా చేశాడు’ అంటూ  ట్వింకిల్‌ ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి : కరోనాపై పోరాటం: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement