జోడీ లేదు

trisha new movie raangi movie launch - Sakshi

‘పేట, 96’ సినిమాల విజయాలతో మంచి హుషారు మీద ఉన్న త్రిష వరుసగా సినిమాలు సైన్‌ చేస్తూ కెరీర్‌లో జెట్‌ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఆమె నటించనున్న ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ పూజాకార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘రాంగీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘లైకాప్రొడక్షన్స్‌ నిర్మాణంలో ‘రాంగీ’ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు త్రిష. ‘ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్‌ ఎమ్‌. శర్వణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ స్క్రిప్ట్‌ను అందించారట. స్క్రిప్ట్‌ పరంగా త్రిష పాత్రకు జోడీ లేదని చెన్నై టాక్‌. ఈ సినిమా కాకుండా కథానాయిక సిమ్రాన్‌తో కలిసి ఓ సినిమా, తిరుజ్ఞానం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు త్రిష.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top