అతని కమిట్‌మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు | Tollywood Producer Suresh Babu 'Pelli Choopulu'movie | Sakshi
Sakshi News home page

అతని కమిట్‌మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు

Jul 19 2016 11:47 PM | Updated on Sep 4 2017 5:19 AM

అతని కమిట్‌మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు

అతని కమిట్‌మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు

దర్శకుడు తరుణ్ భాస్కర్ అండ్ టీం పక్కాగా కథ తయారు చేసుకుని ప్లానింగ్‌గా వెళ్లడంతో ‘పెళ్లి చూపులు’ వంటి మంచి అవుట్‌పుట్ వచ్చింది.

‘‘దర్శకుడు తరుణ్ భాస్కర్ అండ్ టీం పక్కాగా కథ తయారు చేసుకుని ప్లానింగ్‌గా వెళ్లడంతో ‘పెళ్లి చూపులు’ వంటి మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ చిత్రం నాకు నచ్చడంతో రిలీజ్‌లో నేను కూడా భాగస్వామినయ్యా. తరుణ్ గతంలో నన్ను కలిసినప్పుడు నేనో చిత్రం చేయమంటే తను మాత్రం ఈ చిత్రానికే ఫిక్స్ అయిపోయి నా సినిమా చేయనన్నాడు. తన కమిట్‌మెంట్ నచ్చింది. త్వరలో తనతో మా బ్యానర్‌లో ఓ సినిమా చేస్తా’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు.
 
  విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రాగినేని నిర్మించిన ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్‌లో తెరకెక్కించేందుకు ప్లానింగ్‌తో ముందుకెళ్లాం. ప్రొడక్షన్ మైండ్ అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగించడంతో ఎక్కడా ఇబ్బందులు రాలేదు.
 
  ఈ చిత్రాన్ని నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఆరు నుంచి అరవై ఏళ్ల వ యసు వారందరూ చూడదగ్గ చిత్రమిది. గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. వివేక్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలెట్’’ అని పేర్కొన్నారు. విజయ్, రీతూవర్మ, దర్శకుడు ‘మధుర’ శ్రీధర్, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement