42 ఏళ్ల కుర్రాడు | Thaanaa Serndha Koottam Cinema Surya First Look has been released | Sakshi
Sakshi News home page

42 ఏళ్ల కుర్రాడు

Jul 23 2017 11:06 PM | Updated on Sep 5 2017 4:43 PM

42 ఏళ్ల కుర్రాడు

42 ఏళ్ల కుర్రాడు

తమిళ హీరో సూర్య వయసెంత? నిన్నే (ఆదివారం) బర్త్‌డే జరిగింది కదా! అభిమానులు, ప్రేక్షకులు టక్కున ‘సూర్య వయసు 42 ఏళ్లు’ అని చెప్పేస్తారు.

తమిళ హీరో సూర్య వయసెంత? నిన్నే (ఆదివారం) బర్త్‌డే జరిగింది కదా! అభిమానులు, ప్రేక్షకులు టక్కున ‘సూర్య వయసు 42 ఏళ్లు’ అని చెప్పేస్తారు. కానీ, ఈ ఫొటోపై ఓ లుక్కేయండి. 42 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నారా? పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నారు కదూ! అందుకే, 42 ఏళ్ల కుర్రాడని పేర్కొన్నది.

విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘తానా సేంద కూట్టమ్‌’లో సూర్య ఫస్ట్‌ లుక్‌ ఇది. ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య డ్యూయల్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్నారని మరో (సెకండ్‌) లుక్‌ను బట్టి అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement