ఒకేసారి పది సినిమాలు | Ten films at One time | Sakshi
Sakshi News home page

ఒకేసారి పది సినిమాలు

Jul 1 2015 11:12 PM | Updated on Sep 3 2017 4:41 AM

ఒకేసారి పది సినిమాలు

ఒకేసారి పది సినిమాలు

కొత్త తరాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గ్లోబల్ మీడియా అనే బ్యానర్ అనే స్థాపించి ఒకేసారి పది సినిమాలు ప్రారంభించనున్నా.

 ‘‘కొత్త తరాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గ్లోబల్ మీడియా అనే బ్యానర్ అనే స్థాపించి ఒకేసారి పది సినిమాలు ప్రారంభించనున్నా. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తే ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’ చిత్రాల్లాంటివి మళ్లీ వస్తాయి’’ అని దర్శక -నిర్మాత సాయివెంకట్ చెప్పారు. ఈ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘పది సినిమాలను పది డిఫెరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కించనున్నా, ఈ నెలలో లేదా ఆగస్టు చివరి వారంలో ఈ సినిమా ప్రారంభించనున్నాం. పది చిత్రాల పాటలను ఒకేసారి విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత సాయివెంకట్ చెప్పారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి చిత్రాలను నిర్మించాలని ఎమ్మెల్యే క్రిష్ణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement