నా కోసం చూస్తున్నారు! | tapsee talking about her present position | Sakshi
Sakshi News home page

నా కోసం చూస్తున్నారు!

Jan 25 2018 7:35 PM | Updated on Jan 25 2018 7:35 PM

tapsee talking about her present position - Sakshi

జీవితంలో ప్రతి ఒక్కరికీ మంచి కాలం అంటూ ఒకటి వస్తుంది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉన్న వాళ్లే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న విషయాన్ని పక్కన పెడితే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్న నానుడి కూడా ఉంది. కానీ నటి తాప్సీ అలాంటిదేమీ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. దక్షిణాదిలో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఈ ఢిల్లీ చిన్నది అక్కడ రెండు మూడు చిత్రాలు విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. దీంతో తాప్సీ మైండ్‌సెట్‌ మారిపోయింది. తాను అవకాశాల కోసం ఎదురు చూసే కాలం పోయ్యిందని, తన కోసం చిత్ర దర్శక నిర్మాతలు వేచి చూసే టైమ్‌ నడుస్తోందని అహంతో కూడిన వ్యాఖ్యలు చేస్తోంది. 

ఇంతకీ తాప్సీ ఏమంటుందో చూద్దాం.. ఈ మధ్య టాలీవుడ్‌లో ఆనందోబ్రహ్మ అనే చిత్రంలో తానే నటించాలని ఆ చిత్ర దర్శక నిర్మాతలు భావించారని చెప్పింది. అందుకు ఆ చిత్రం తన కాల్‌షీట్స్‌ కోసం ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్పింది. అంతే కాదు ఆ చిత్రానికి తన పారితోషికానికి బదులు షేర్‌ ఇవ్వడానికి రెడీ అన్నారని తెలిపింది. అదే విధంగా ప్రస్తుతం మరో అవకాశం వచ్చిందని, ఆ చిత్రం తన కాల్‌షీట్స్‌ కోసం నెల రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అంది. అందుకు ఆ చిత్ర దర్శక నిర్మాతలు అంగీకరించారని చెప్పింది. అంతే కాకుండా తన కాల్‌షీట్స్‌కు తగ్గట్టుగా చిత్ర షూటింగ్‌ను నిర్వహించడానికి హీరోను అంగీకరింపజేశారని తెలిపింది. దీంతో తానా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని చెప్పింది. అలా తనకు బదులు వేరే నటిని ఎంపిక చేసుకునే పరిస్థితి మారి తనను మార్చలేనంత స్థాయిలో తాను ఉన్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement