తమన్నా మారిపోయిందా..?

Tamannaah Bhatia Decided to Reject Glamour Roles - Sakshi

సినిమా:  నటి తమన్నా మారిపోయిందట. ఏమియా మార్పు? ఏ మా కథ..చూసేస్తే పోలా! గ్లామర్‌కు మారు పేరు ఈ అమ్మడు. ఆదిలో అందాలను నమ్ముకుని కథానాయకిగా ఎదిగిన నటి తమన్నా. అందాలారబోత అంటే అలా ఇలా కాదు. రెచ్చిపోవడమే. అలా ఈత దుస్తుల్లో తడి తడి అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టడంలో ఈ బ్యూటీ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక ఐటమ్‌ సాంగ్స్‌లో అయితే చెప్పనక్కర్లేదు. అదేమంటే డాన్స్‌ అంటే నాకిష్టం అనే సమాధానం ఈ జాణ నుంచి వస్తుంది. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన కల్లూరి చిత్రంలోనే నిరూపించుకున్నా, ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్‌కే ఎక్కువగా వాడుకుంటున్నారు. అయితే ప్రతి నటి, నటుడికి జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోయే చిత్రం అంటూ ఉంటుంది. అలా తమన్నా నట జీవితంలో బాహుబలి చిత్రం మరచిపోలేని చిత్రంగా గుర్తిండిపోతుంది. ఆ తరువాత ఈ అమ్మడికి సరైన పాత్ర లభించలేదనే చెప్పాలి. మళ్లీ షరా మామూలుగా గ్లామర్‌ పాత్రలపై మొగ్గు చూపుతూ వచ్చింది. అదే విధంగా హర్రర్‌ కథా చిత్రాలు తమన్నాకు వరుస కడుతున్నాయి. ఇలాంటి సమయంలో సైరాతో మరోసారి తనలోని నటిని బయటకు తీసే అవకాశం వచ్చింది.

పాత్రలో సత్తా ఉండాలేగాని, నమిలేస్తా అన్నట్టుగా సైరా చిత్రంలో లక్ష్మీ పాత్రకు జీవం పోసింది తమన్నా. నిజం చెప్పాలంటే అ చిత్రంలో నయనతార కంటే తమన్నా పాత్రకే పేరు వచ్చింది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తమిళ చిత్రం పెట్రోమ్యాక్స్‌ తమన్నాకు సక్సెస్‌ను అందించింది. తమన్నాలో మార్పుకు ఈ చిత్రాలేనట. ఇంతకీ ఆ మార్పు ఏమిటో చెప్పనేలేదు కదూ! ఇకపై గ్లామర్‌కు దూరంగా ఉండాలని తమన్నా నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానంటోంది. అది సరే ఈ మిల్కీబ్యూటీ గ్లామర్‌ను ఎంజాయ్‌ చేసే యువత పరిస్థితి ఏమిటీ? అందాలారబోతకు దూరం అన్న తమన్నా నిర్ణయం వారిని తీరని నిరాశాపాతంగా మారుతుందే. ఏదేమైనా మంచి కుటుంబ కథా పాత్రల్లో నటించాలన్న తమన్నా ఆశను ఆహ్వానించాల్సిందే గానీ, ఈ బ్యూటీ తన మాటపై నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుతం విశాల్‌తో నటిస్తున్న యాక్షన్‌ చిత్రంలో గ్లామరస్‌గానే కనిపించనుంది. ఇకపోతే పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు  తన పెళ్లి గురించి చాలానే ప్రచారం అవుతోందని, అయితే అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. కొందరు ఈ విషయంలో కావాలనే కల్పిత రాతలు రాస్తున్నారని, అలాంటి వాటినన్నింటిని తన వద్దకు తీసుకొస్తే, వాటిలో తానే ఒక చిత్రంగా నిర్మించడానికి సిద్ధం అని కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నటుడు గోపీచంద్‌కు జంటగా నటిస్తోందట. అందులో కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నట్లు తమన్నా చెప్పింది. అదే విధంగా హిందీ చిత్రం క్వీన్‌ తెలుగు రీమేక్‌ దటీజ్‌ మహాలక్ష్మీ చిత్రంలో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top