అందుకు చావడానికి, చంపడానికైనా సిద్ధమే! | Tamanna about Baahubali | Sakshi
Sakshi News home page

అందుకు చావడానికి, చంపడానికైనా సిద్ధమే!

Dec 21 2016 1:38 AM | Updated on Sep 4 2017 11:12 PM

అందుకు చావడానికి, చంపడానికైనా సిద్ధమే!

అందుకు చావడానికి, చంపడానికైనా సిద్ధమే!

అందుకోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమే అంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏమిటీ సినిమా డైలాగ్‌లా ఉందా?

అందుకోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమే అంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏమిటీ సినిమా డైలాగ్‌లా ఉందా? అయితే తమన్నా మాత్రం రీల్‌ కోసం కాకుండా రియల్‌గానే అన్నారు. కొన్ని చిత్రాలు కొందరి తారల జీవితాలపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. అదే విధంగా కొందరు తారలు వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా ఒక్క చిత్రం అయినా గర్వపడేలా ఉండాలి. లేకపోతే అలాంటి వారి నట జీవితానికి అర్థం ఉండదు. నటి అనుష్కనే తీసుకుంటే అరుంధతి ఒక్కటి చాలు తనకు ఆత్మసంతృప్తిని కలిగించడానికి. అదే విధంగా తమన్నాకు బాహుబలి తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచి పోతుంది. ఈ చిత్రం గురించి ఎప్పుడు మాట్లాడినా మిల్కీబ్యూటీ చాలా ఎమోషనల్‌ అయిపోతారు. బాహుబలి చిత్రంలో నటించడాన్ని చాలా సందర్భాల్లో చాలా గర్వంగా చెప్పారు.

తాజాగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రను జీవితంలో మరచిపోలేనన్నారు. అలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు. తన కెరీర్‌ పూర్తిగా డౌన్ అయిన సమయంలో బాహుబలి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆ చిత్రం కోసం చావడానికైనా, చంపడానికైనా రెడీ అని చాలా ఎమోషన్ గా అన్నారు. ప్రస్తుతం బాహుబలి–2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందేనని, ఈ చిత్రం షూటింగ్‌ ఈ నేలాఖరుకు పూర్తి అవుతుందని తమన్నా చెప్పారు. తమన్నా తాజాగా విశాల్‌తో నటించిన కత్తిసండై చిత్రం తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో విడుదల కానుంది. రెండు భాషల్లోనూ 23న తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement