కలెక్షన్‌ క్వీన్‌ | Taapsee Pannu is most successful actress of last 12 months | Sakshi
Sakshi News home page

కలెక్షన్‌ క్వీన్‌

Jun 8 2020 3:40 AM | Updated on Jun 8 2020 3:40 AM

Taapsee Pannu is most successful actress of last 12 months - Sakshi

బాలీవుడ్‌లో హీరోయిన్‌ తాప్సీ హవా నడుస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ విడుదలైన తాప్సీ నటించిన ఐదు సినిమాల గ్రాస్‌ కలెక్షన్స్‌ దాదాపు 352 కోట్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. తాప్సీ  నటించిన హిందీ చిత్రం ‘బద్లా’ 88 కోట్లు, ‘గేమ్‌ ఓవర్‌’ (తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో డబ్‌ చేశారు) 4.69 కోట్లు (హిందీ కలెక్షన్స్‌ మాత్రమే), ‘మిషన్‌ మంగళ్‌’  202.98 కోట్లు, ‘శాండ్‌కీ ఆంఖ్‌’ 23.40 కోట్లు, ‘థప్పడ్‌’  33.06 కోట్ల వసూళ్లను రాబట్టాయి.

ఇలా తాప్సీ నటించిన గత ఐదు సినిమాల వసూళ్లు మొత్తం కలిపితే 350 కోట్లు. దీంతో ఈ బ్యూటీని బాలీవుడ్‌ కలెక్షన్‌ క్వీన్‌ అని పిలుచుకుంటున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం తాప్సీ చేతిలో ‘శభాష్‌ మిథూ’ (క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌), హసీనా దిల్‌రుబా, లూప్‌ లపేటా (జర్మన్‌ థ్రిల్లర్‌ ‘రన్‌లోలా రన్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌) అనే మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమా ‘ఝుమ్మంది నాదం’తో కథానాయికగా పరిచయమై, ఇక్కడ అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకెళుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement