ఎలాంటి వెడ్డింగ్ అయినా ఓకే! | Taapsee Pannu is all set to become a wedding planner | Sakshi
Sakshi News home page

ఎలాంటి వెడ్డింగ్ అయినా ఓకే!

Jul 26 2015 11:05 PM | Updated on Sep 3 2017 6:13 AM

ఎలాంటి వెడ్డింగ్ అయినా ఓకే!

ఎలాంటి వెడ్డింగ్ అయినా ఓకే!

మీ ఇంట్లో పెళ్లి చేయాలా? మీరెంత బడ్జెట్ లో అంటే అంతలో చేసేస్తా. గ్రాండ్‌గా మెరిపించాలా? సింప్లీ సుపర్బ్ అనిపించాలా?... ఏ వెడ్డింగ్ అయినా నాకు ఓకే.

 ‘‘మీ ఇంట్లో పెళ్లి చేయాలా? మీరెంత బడ్జెట్ లో అంటే అంతలో చేసేస్తా. గ్రాండ్‌గా మెరిపించాలా? సింప్లీ సుపర్బ్ అనిపించాలా?... ఏ వెడ్డింగ్ అయినా నాకు ఓకే. ఇట్టే చేసేస్తా’’ అంటున్నారు కథానాయిక తాప్సీ. అదేంటీ? తాప్సీ పెళ్లిళ్లు చేయడం ఏంటీ అనుకుంటున్నారా? తాప్సీ ఇటీవలే వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఒకవైపు సినిమాలను, మరోవైపు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ‘‘ఈ వ్యాపారం ఆలోచన చాలాకాలం నుంచి ఉంది. కానీ దీన్ని ఆచరణలో పెట్టేలా చేసింది మాత్రం నేను కథానాయికగా చేస్తున్న ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రమే’’ అని తాప్సీ పేర్కొన్నారు.
 
 ఇంకా వివరంగా చెబుతూ - ‘‘వెడ్డింగ్ ప్లానింగ్‌కి మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. అది ఎవర్ గ్రీన్ వ్యాపారం. నేను ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పటి రోజుల నుంచే నా ఫ్రెండ్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకున్నా. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని, వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ మొదలుపెట్టింది. నేనేమో సినిమాల్లో బిజీ అయిపోయా. ఇలా అయితే బిజినెస్ చేయాలనే నా కోరిక ఎప్పటికీ తీరదనిపించింది. అందుకే ఇప్పుడు నా స్నేహితురాలితో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ మొదలుపెట్టాను. ఇందులో ఏ మాత్రం తప్పు జరిగినా, అది నా ఇమేజ్ మీద చాలా ప్రభావం చూపుతుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని తాప్సీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement