ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

Taapsee Pannu Counter To Troll Over Dig At Kabir Singh Director In Her Cryptic Tweet - Sakshi

‘ఓకే సార్‌... నాకు థెరపీ సెషన్స్‌ ఎప్పుడు మొదలుపెడుతున్నారు?? అలాగే ఖరీదైన నటిగా మారడానికి ఎంత తీసుకుంటారో.. ఎలా బేరం కుదుర్చుకోవాలో చెప్పండి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది కదా అందుకే నేను కూడా’ అంటూ తనను ట్రోల్‌ చేసిన ఓ వ్యక్తికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు హీరోయిన్‌ తాప్సీ. తన హిందీ డెబ్యూ మూవీ కబీర్‌సింగ్‌పై విమర్శలను తిప్పికొట్టే క్రమంలో..‘ప్రేమలో ఉన్నవాళ్లు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే బంధంలో ఎమోషన్‌ ఉండదంటూ ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నటీమణులు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో తాప్సీ కూడా సందీప్‌ను విమర్శించే క్రమంలో... మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపిన వార్తను ట్యాగ్‌ చేస్తూ...‘ వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో... అమ్మాయి మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికి ఇలా చేశాడా’? అంటూ పరోక్షంగా సందీప్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు తాప్సీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ‘ నువ్వొక చీప్‌ యాక్టర్‌వి. నీ మానసిక స్థితి సరిగ్గా లేదు’ అంటూ ట్రోల్‌ చేశాడు. అతడి ట్వీట్‌కు బదులుగా తాప్సీ పైవిధంగా స్పందించారు. ఈ క్రమంలో కొంతమంది తాప్సీకి మద్దతుగా నిలుస్తూ.. మీరు గొప్ప నటి. అలాంటి చెత్త మాటలు పట్టించుకోవద్దంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇందుకు స్పందించిన తాప్సీ...‘ వాళ్లు మారిపోవాలని నేను అనుకోవడం లేదు. నిజానికి అలాంటి వాళ్లు ఎంతో వినోదాన్ని పంచుతారు తెలుసా! మారమని చెప్పి వాళ్ల హాస్య చతురతను నేనెలా చంపేయగలను. వాళ్లు ఎంతో కంటెంట్‌ ఉన్న వాళ్లు. వాళ్లను ఉపయోగించుకోవాలో మనకు తెలుసు’ అంటూ తనకు కాంప్లిమెంట్‌ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా టాలీవుడ్‌ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. తొలుత గ్లామర్‌ డాల్‌ పాత్రలకే పరిమితమైన తాప్సీ ఇటీవల కాలంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంలో ‘సాంద్‌ కీ ఆంఖ్‌’  అనే సినిమాకు సైన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో తాప్సీ కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top