మిసెస్‌ షారుక్‌!

Taapsee Pannu and Amitabh Bachchan together in Badla - Sakshi

రిజల్ట్‌ గురించి పక్కన పెడితే ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్‌ను చూసి ఫుల్‌ ఖుషీ అయ్యారు సినీ ప్రియులు. ఇప్పుడు అమితాబ్, షారుక్‌ ఖాన్‌ కలిసి నటించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ‘పింక్‌’ మూవీ తర్వాత అమితాబ్‌ బచ్చన్, తాప్సీ కలిసి ‘బద్లా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజోయ్‌ ఘోష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారట షారుక్‌.

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తాప్సీ భర్త పాత్రలో షారుక్‌ కనిపిస్తారట. షారుక్‌ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర నిడివి పెంచారట ‘బద్లా’ టీమ్‌. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘జీరో’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు షారుక్‌. ఈ నెల 21న ‘జీరో’ చిత్రం విడుదలైన తర్వాత ‘బద్లా’ షూటింగ్‌లో షారుక్‌ పాల్గొంటారట. ‘ది ఇన్‌విజిబుల్‌ గెస్ట్‌’ అనే స్పానిష్‌ చిత్రానికి రీమేక్‌ అయిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top