మైసూరు పోదాము | sye raa narasimha reddy next scheduled shooting in mysore | Sakshi
Sakshi News home page

మైసూరు పోదాము

Dec 8 2018 1:40 AM | Updated on Dec 8 2018 1:40 AM

sye raa narasimha reddy next scheduled shooting in mysore - Sakshi

చిరంజీవి

సూపర్‌ క్లైమాక్స్‌ కోసం జార్జియాకు వెళ్లొచ్చారు ‘సైరా’ టీమ్‌. రీసెంట్‌గా హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశారు. త్వరలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం మైసూర్‌కు మకాం మార్చాలని ‘సైరా’ టీమ్‌ భావిస్తోందని సమాచారం. అక్కడ సెట్‌ వర్క్‌ డిజైన్స్‌ కూడా పూర్తయ్యాయట. అది మాత్రమే కాదు.. ఫేమస్‌ మైసూర్‌ ప్యాలెస్‌లోనూ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’.

టైటిల్‌ రోల్‌లో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ మైసూర్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. ఓ సాంగ్‌ షూట్‌ కూడా ఉంటుందట. అమితాబ్‌ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది స్వరకర్త. ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement