మాకో టైటిల్‌ పెట్టండి

Surya 37 Title announcement on New Years - Sakshi

సూర్య ఫ్యాన్స్‌కు భలే చాన్స్‌ ఇచ్చారు దర్శకుడు కేవీ ఆనంద్‌. సూర్యతో ఈ దర్శకుడు ఓ స్టైలిష్‌ థ్రిల్లర్‌ రూపొందిస్తున్నారు. కథానుసారంగా ఆ చిత్రానికి మూడు టైటిల్స్‌ను అనుకున్నారు చిత్రబృందం. అయితే ఏది ఫిక్స్‌ చేయాలో అర్థం కాలేదు. దాంతో నిర్ణయాన్ని అభిమానులకే వదిలేశారు. ‘‘మేం మూడు టైటిల్స్‌ అనుకున్నాం. అందులో ఏ టైటిల్‌ బావుంటుందో చెప్పండి’’ అంటూ ‘మీట్‌పాన్, కాప్పాన్, ఉయిర్కా’..  ఈ మూడు టైటిల్స్‌ను పెట్టి ఓ పోల్‌ నిర్వహించారు.

ఆ మూడు టైటిల్స్‌ అర్థం దగ్గరదగ్గరగా ఒకటే. కాపాడటం, రక్షించడం అనే అర్థాలు వస్తాయి. ఫస్ట్‌ రెండు టైటిల్స్‌ కంటే మూడో టైటిల్‌ విభిన్నంగా ఉందని ‘ఉయిర్కా’ అనే టైటిల్‌కు ఎక్కువ ఓట్లు వేశారు. మరి ఫైనల్‌గా చిత్రబృందం ఏ టైటిల్‌ ఫిక్స్‌ చేస్తుందో చూడాలి. జనవరి 1న టైటిల్‌ను అనౌన్స్‌ చేయనున్నారు.  ఇందులో సూర్య రక్షణ శాఖ అధికారిగా కనిపిస్తారు. సయేషా కథానాయిక. మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top