గాయకులుగా...

Suriya and Karthi turn singers for Venkat Prabhu's film Party - Sakshi

మన టాలీవుడ్‌కి  మోస్ట్‌ ఫేవరెట్‌ బ్రదర్స్‌ సూర్య, కార్తీ. ఈ ఇద్దరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కలిసి యాక్ట్‌ చేస్తారు? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి టైమ్‌ ఉంది. కానీ త్వరలో కలిసి వినిపించనున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పార్టీ’. జై, రెజీనా, రమ్యకృష్ట ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. నటుడు ప్రేమ్‌జీ అమరన్‌ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఈ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top