శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..! | Super Star Mahesh babu name considered for sri krishna | Sakshi
Sakshi News home page

శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..!

Apr 20 2017 10:32 AM | Updated on Sep 5 2017 9:16 AM

శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..!

శ్రీ కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్..!

బాహుబలి సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న సమయంలో మరో భారీ చిత్రం వార్తల్లో నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్

బాహుబలి సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న సమయంలో మరో భారీ చిత్రం వార్తల్లో నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వాసుదేవనాయర్ రచించిన రంథమూలం నవల ఆధారంగా మహాభారత గాథని తెరకెక్కిస్తున్న సంగతి తెలసింది. ప్రముఖ వ్యాపారవేత్త బిఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్తో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండగా, యాడ్ ఫిలిం డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.

2018లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. సినిమాలో కీలకమైన భీముడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తుండగా.. శ్రీకృష్ణుడి పాత్రకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంప్రదిస్తున్నారు. మహేష్ ఈ పాత్రకు ఒప్పుకోని పక్షంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ ను శ్రీకృష్ణుడి పాత్రకు ఒప్పించాలని భావిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాను 2020లో తొమ్మిది నెలల గ్యాప్లో రెండు భాగాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement