టార్జాన్ సుందరిగా... | Sunny Leone to play Jane in 'Tarzan' remake? | Sakshi
Sakshi News home page

టార్జాన్ సుందరిగా...

Sep 30 2014 11:16 PM | Updated on Sep 2 2017 2:11 PM

టార్జాన్ సుందరిగా...

టార్జాన్ సుందరిగా...

మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో వచ్చిన ‘అడ్వంచర్ ఆఫ్ టార్జాన్’ చిత్రం ఓ సంచలనం. దేశవ్యాప్తంగా విజయదుందుభి మోగించి, అప్పట్లోనే మూడుకోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లను రాబట్టింది.

మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో వచ్చిన ‘అడ్వంచర్ ఆఫ్ టార్జాన్’ చిత్రం  ఓ సంచలనం. దేశవ్యాప్తంగా విజయదుందుభి మోగించి, అప్పట్లోనే మూడుకోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. హేమంత్ బిర్జీ టార్జాన్‌గా నటించిన ఆ చిత్రంలో కిమీ కట్కర్ కథానాయికగా నటించారు. బప్పీలహరి సంగీత సారథ్యంలో సంగీత పరంగా కూడా సంచలనం సృష్టించిందీ సినిమా. ఇప్పుడు ‘టార్జాన్’ ముచ్చట దేనికా అనుకుంటున్నారా! ఈ సినిమాను రీమేక్ చేయడానికి దర్శకుడు సోహాన్ షా ప్రస్తుతం సన్నాహాలు చేసుకుంటున్నారు.
 
  ఈ అడ్వంచరస్ మూవీలో టార్జాన్‌గా నటించే బాలీవుడ్ స్టార్ ఎవరో తేలాల్సి ఉంది. అయితే... కథానాయిక కిమీ కట్కర్ పాత్రకు మాత్రం ఇప్పటికే సన్నీలియోన్‌ని సోహాన్ ఖరారు చేసినట్లు బాలీవుడ్ సమాచారం. నాటి ‘టార్జాన్’ సినిమాలో కిమీ కట్కర్ అందచందాలు కుర్రకారుని కిర్రెక్కించాయి. మరి ఆ స్థాయిలో అందాల ప్రదర్శన ఒక్క సన్నీలియోన్‌కే సాధ్యమని సోహాన్ భావించారట. సన్నీ కూడా ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా యువతకు కనువిందు ఖాయమని ప్రత్యేకించి చెప్పాలా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement