'డీకే' చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్ | Sunny Leone shoots item number for 'DK' | Sakshi
Sakshi News home page

'డీకే' చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్

Aug 4 2014 11:36 AM | Updated on Sep 2 2017 11:22 AM

'డీకే' చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్

'డీకే' చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్

ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఐటెం సాంగ్లకు డాన్సు చేసిన శృంగార తార సన్నీ లియోన్ ఇప్పుడు తాజాగా కన్నడంలో కూడా రంగప్రవేశం చేసింది.

ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఐటెం సాంగ్లకు డాన్సు చేసిన శృంగార తార సన్నీ లియోన్ ఇప్పుడు తాజాగా కన్నడంలో కూడా రంగప్రవేశం చేసింది. 'డీకే' అనే చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ జానపద గీతానికి ఆమె డాన్స్ చేస్తోంది. 'శేషమ్మా.. శేషమ్మా' అంటూ ఈ పాట సాగుతుంది. గత మూడు రోజులుగా ఈ పాట షూటింగ్ సాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు.

సోమవారంతో పాట షూటింగ్ ముగిసిపోతుంది. ఈ పాటలో సన్నీలియోన్ను చూసి కన్నడ ప్రేక్షకులు ఆనందిస్తారని సినిమా వర్గాలు అంటున్నాయి. సన్నీ లియోన్ వచ్చిందన్న విషయం నగరంలో ప్రచారం అయితే ఆమె స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, అందుకే ఈ పాటను రహస్యంగా చిత్రీకరిస్తున్నామని తెలిపాయి. ఉదయప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న 'డీకే' చిత్రంలో ప్రేమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే మంచు మనోజ్ సరసన 'కరెంటుతీగ' చిత్రంలో కూడా సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. తమిళంలో వడా కర్రీ చిత్రంలోనూ ఆమె ఐటెం సాంగ్కు డాన్స్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement