కొన్ని క్షణాలు నేను అశ్విన్‌ అయ్యా | Sukumar becomes Nag Ashwin for a while | Sakshi
Sakshi News home page

కొన్ని క్షణాలు నేను అశ్విన్‌ అయ్యా

May 11 2018 12:21 AM | Updated on May 11 2018 12:21 AM

Sukumar becomes Nag Ashwin for a while - Sakshi

సుకుమార్‌, నాగ్‌ అశ్విన్‌

సుకుమార్‌ కాసేపు నాగ్‌ అశ్విన్‌ అయ్యారు. ‘‘నేను సుకుమార్‌ని కాదు’’ అని అసలు విషయం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. ఎందుకలా? అంతలా సుకుమార్‌ మౌనంగాఉండిపోవ డానికి కారణం ఏంటి? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

‘ప్రియ’మైన అశ్విన్,
‘మహానటి’ సినిమా చూసి బయటకి వచ్చి, నీతో మాట్లాడదామని నీ నంబర్‌కి ట్రై చేస్తున్నాను.. ఈలోగా ఒక ఆవిడ వచ్చి ‘‘నువ్వు డైరెక్టరా బాబు’’ అని అడిగింది. అవునన్నాను... అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ‘‘ఎంత బాగా చూపించావో బాబు.. మా సావిత్రమ్మని’’ అంటూ.. నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా... ఆవిడ నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.– సుకుమార్‌ (కొన్ని క్షణాల అశ్విన్‌) (గమనిక: ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు..) అంటూ ‘ఫేస్‌బుక్‌’ ద్వారా దర్శకుడు సుకుమార్‌ తన అనుభూతిని పంచుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘మహానటి’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి, థియేటర్‌ నుంచి బయటికొచ్చిన సుకుమార్‌కి ఎదురైన అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement